Andhra PradeshNews

ఎస్పీ ఫోరెన్సిక్‌ నిపుణుడా..?

Share with

ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియో ఎపిసోడ్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ స్పందించారు. అనంతపురం ఎస్పీ ఏ ఆధారంగా తీసుకొని గోరంట్ల వీడియోను ఫేక్‌ అని ఎలా ప్రకటిస్తారన్నారు.  ఏ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ రిపోర్ట్‌ ఇచ్చిందో చూపించాలన్నారు. సీఎం జగన్‌ ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదని.. 5 రోజుల తర్వాత ఫేక్‌ అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అంబటి రాసలీలలు కూడా ఫేక్‌ అంటారా అనే సందేహం కలుగుతుందని… మంత్రి అవంతి చేసింది కూడా కాదంటారని లోకేష్‌ మండిపడ్డారు. వైసీపీ నేతలు కొందరు మహిళల్ని కించపరుస్తున్నారని.. అసెంబ్లీ సాక్షిగా తన తల్లిని కించపరిచారన్నారు. శాసనసభలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తనను ఉద్ధేశించి నోటికొచ్చినట్లు మాట్లాడిన విషయాన్ని ప్రస్తావించారు. తనకు మరో పెళ్ళి జరిగిందని తప్పుడు ప్రచారం చేశారు. చివరకు తమ ఇంట్లో జరిగిన దురదృష్టకర ఘటనపై కూడా రాజకీయాలు నడిచాయన్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో తాను తప్పకుండా పోటీ చేస్తామన్నారు నారా లోకేష్‌.