మా అసోషియేషన్ కీలక నిర్ణయం-ఆ యూట్యూబ్ ఛానెల్స్
అసత్యవార్తలను ప్రచారం చేసే ఐదు యూట్యూబ్ ఛానెళ్లను రద్దు చేస్తున్నట్లు మూవీ ఆర్టిస్ట్ (MAA) అసోషియేషన్ పేర్కొంది. నటీనటులు, వారి కుటుంబసభ్యులే లక్ష్యంగా వ్యక్తగత విమర్శలు చేస్తున్నందువల్ల ఈ ఛానళ్లను రద్దు చేసినట్లు మా తెలిపింది. వాటిలో జస్ట్ వాచ్ బీబీసీ, ట్రోల్స్ రాజా, బచినా లలిత్, హైదరాబాద్ కుర్రాడు, XYZ edit 007 అనే ఛానెళ్లు ఉన్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఛానళ్లపై చర్యలు కొనసాగుతాయని ఎక్స్‌లో పోస్టు చేసింది. హీరో హీరోయిన్లను విమర్శిస్తూ చేసిన వీడియోలను, కామెంట్లను తొలగించాలంటూ డిజిటల్ కంటెంట్ క్రియేటర్లకు మా అధ్యక్షుడు మంచు విష్ణు ఇటీవల విజ్ఞప్తి చేశారు. ట్రోలింగ్ వీడియోలను డిలీట్ చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసినా, నటీనటులపై డార్క్ కామెడీ పేరుతో వీడియోలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ పెద్దలను కోరుతున్నానని వీడియోలో విజ్ఞప్తి చేశారు విష్ణు. వీటిని తొలగించకపోతే సైబర్ సెక్యూరిటీకి ఫిర్యాదు చేస్తామన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు మా మూవీ అసోసియేషన్ తరపున అప్పీలు చేస్తున్నట్లు తెలిపాడు.