NewsTelangana

ఓటర్ల చేతిపై మెహెందీతో కమలం గుర్తు

మునుగోడు రణ క్షేత్రాన్ని తలపిస్తోంది. గత కొద్దిరోజులుగా మునుగోడులో ప్రచార పర్వం హోరెత్తుతోంది. ఈ క్రమంలో మహిళా ఓటర్ల చేతిపై మెహెందీతో  కమలం గుర్తు వేయడం చర్చనీయాంశంగా మారింది. ఈటల జమున సొంత ఊరైన పలిమెలలో సుమారు 400 మంది మహిళల అరచేతిపై మెహెందీతో కమలం గుర్తును వేశారు. దీనిపై టీఆర్‌ఎస్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఇలా చేతిపై గుర్తు ఉన్నవారికి ఓటును వేసే హక్కు ఉండదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి తెలిపారు. ఓట్లు వేయకుండా కుట్రకు తెరలేపిన జమునతో పాటు ఈటల రాజేందర్ ను అరెస్ట్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.