బీజేపీ కంటే ఒక రోజు ముందే టీఆర్‌ఎస్ సభ
మునుగోడు ఉప ఎన్నికలో నువ్వా.. నేనా.. అన్నట్లు తలపడుతున్న టీఆర్‌ఎస్, బీజేపీ ప్రచార హోరును కూడా పోటాపోటీగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ టికెట్‌పై పోటీ చేయనున్నందున మునుగోడులో ఈ నెల 21వ తేదీన భారీ సభను నిర్వహించాలని బీజేపీ ఓవైపు ప్రణాళికను రూపొందిస్తుంటే.. మరోవైపు టీఆర్‌ఎస్ కూడా అంతకు ఒక రోజు ముందే సభకు ఏర్పాట్లు చేస్తోంది.
20వ తేదీన నిర్వహించే ఈ సభకు లక్ష మందికి తగ్గకుండా జనసమీకరణ జరగాలని స్థానిక పార్టీ నేతలను సీం కేసీఆర్ పురమాయించినట్లు తెలుస్తోంది. గురువారం నాటి రాష్ట్ర కేబినెట్‌లో మునుగోడు ఉప ఎన్నికపై చర్చ జరిగిందని, బీజేపీకి షాక్ ఇచ్చేందుకు వ్యూహం రూపొందించారని నిర్ణయించినట్లు సమాచారం. పార్టీ అభ్యర్థిగా ఎవరిని నిర్ణయించినా విజయం కోసం కలిసికట్టుగా శ్రమించాలని పార్టీ నాయకులకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు.