గుజరాత్ అసెంబ్లీకి మోగిన ఎన్నికల నగారా
గుజరాత్‌లో ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర అసెంబ్లీకి డిసెంబరు 1, 5వ తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. 8వ తేదీన కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తామని గురువారం ప్రకటించిన షెడ్యూల్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 182 అసెంబ్లీ స్థానాలకు తొలి దశలో 89 స్థానాలకు.. రెండో దశలో 93 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్..
నవంబరు 5న తొలి దశ ఎన్నికలకు నోటిఫికేషన్
నవంబరు 10న రెండో దశ ఎన్నికలకు నోటిఫికేషన్
నవంబరు 14న తొలి దశ నామినేషన్ల స్వీకరణ
నవంబరు 15న తొలి దశ నామినేషన్ల పరిశీలన
నవంబరు 17 వరకు తొలి దశ నామినేషన్ల ఉపసంహరణ
నవంబరు 17 వరకు రెండో దశ నామినేషన్ల స్వీకరణ
నవంబరు 18న రెండో దశ నామినేషన్ల పరిశీలన
నవంబరు 21 వరకు రెండో దశ నామినేషన్ల ఉపసంహరణ
డిసెంబరు 1 న తొలి దశ పోలింగ్
డిసెంబరు 5న రెండో దశ పోలింగ్
డిసెంబరు 8న కౌంటింగ్