NewsTelangana

ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఛైర్మన్ సుదర్శన్ కన్నుమూత

గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఛైర్మన్ కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం మృతిచెందినట్టు ఆయన కుమారుడు సింగిరి రాజ్ కుమార్ తెలిపారు. పంజాగుట్ట స్మశాన వాటికలో ఇవాళ అంత్యక్రియలు నిర్వహిస్తారు. గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు పేరు ప్రఖ్యాతలు లభించాయ్. భారీ గణేష్ నిర్మాణానికి ఆయన ప్రణాళిక మేరకు పనిచేస్తారు. గణేష్ నవరాత్రులకు సంబంధించి ముందస్తు వ్యూహాలను రూపొందించి… అందరిని కలుపుకొని ఆయన పనిచేసేవారు. గణేష్ పై ఆయనకున్న ప్రేమ అంచెంచల విశ్వాసం ఆమొఘం. నిమజ్జనం రోజున సైతం ఆయన అంబులెన్స్‌లో ఉండి గణేశ్ శోభాయాత్రలో పాల్గొన్నారు. బలగంగాధర్ స్ఫూర్తితో గణేష్ ఉత్సవాల నిర్వహణ చేపట్టారు సుదర్శన్ తండ్రి శంకరయ్య. ఆయన వారసత్వంగా నేటికీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సుదర్శన్ ఆలోచనల మూలంగా.. ఖైరతాబాద్ గణేష్‌కు దేశ వ్యాప్త క్రేజ్ వచ్చింది.