Andhra PradeshHome Page Slider

పామర్రులో ఆశేష ప్రజానికం మధ్య సాగిన సామాజిక సాధికార యాత్ర

•షణ్ముకు వ్యూహాలు ఎన్ని పన్నినా.. సీఎం జగన్‌కు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు వర్గాలు అండగా ఉన్నారు: మంత్రి జోగి

•చంద్రబాబును బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలెవరూ నమ్మ వద్దు : మంత్రి మేరుగు నాగార్జున

పామర్రులో ఎమ్మెల్యే కైలే అనిల్‌ కుమార్‌ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార బస్సుయాత్ర సాగింది. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు, ప్రజలు తరలివచ్చారు. అనంతరం జరిగిన రంగసభలో మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ 75 సంవత్సరాల భారతదేశంలో సామాజిక సాధికారత చూపిన నాయకులు సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి అని అన్నారు. షణ్ముకు వ్యూహాలు ఎన్ని పన్నినా.. సీఎం జగన్‌కు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు వర్గాలకు అండగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. అట్టడుగు వర్గాలను చూసి సీఎం జగన్‌ అందలం ఎక్కిస్తుంటే.. దాన్ని చూసి ఓర్వలేక పవన్‌ కల్యాణ్‌, నారా లోకేష్‌, చంద్రబాబు వ్యూహాలు పన్నుతున్నారన్నారని ధ్వజమెత్తారు. కులం, మతం, పార్టీలు చూడకుండా సంక్షేమ పథకాలు ఇస్తున్న సీఎం జగన్‌కు అందరి మద్దతు ఉంటుందని మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు. వర్ల రామయ్యను రాజ్యసభ సభ్యుడిని చేస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశాడన్నారు. అదే జగనన్న బీసీలను రాజ్యసభలోకి పంపారన్నారు. ఎస్సీలను మంత్రులను చేశారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల మద్దతు సీఎం జగన్‌కు ఉంటుందని మంత్రి జోగి స్పష్టం చేశారు.


మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ
2014లో చంద్రబాబు, పవన్, బీజేపీ కలిసి పోటీ చేశారని, 600కు పైగా హామీలిచ్చి మోసం చేశాడని మంత్రి విమర్శించారు. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న వ్యక్తి చంద్రబాబు.. ఎస్సీలను ఘోరంగా అవమానించాడని గుర్తు చేశారు. పేదలకు ఆరోగ్యం,ఇంగ్లీషు మీడియం చదువు కల్పించిన మహోన్నతమైన వ్యక్తి సీఎం జగన్‌ అని కొనియాడారు. చంద్రబాబును బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలెవరూ నమ్మొద్దని సూచించారు. సీఎం జగన్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని బీసి, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీ వర్గాలు ఐక్యతగా ఉండాలని, సీఎంకు మనం అండగా నిలిచి.. మళ్లీ గెలిపించుకోవాలని మంత్రి మేరుగు నాగార్జున పిలుపునిచ్చారు.