Andhra PradeshHome Page Slider

త్వరలో విశాఖ నుంచే పాలన-వైఎస్ జగన్ ఫుల్ క్లారిటీ

విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సదస్సుకు రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, జీఎంఆర్ అధినేత గ్రంధి మల్లికార్జునరావుతోపాటుగా ప్రముఖ కంపెనీల అధినేతలు హాజరయ్యారు. విశాఖ సదస్సు ద్వారా 340 పెట్టుబడుల ప్రొపొజల్స్, 13 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలను కుదుర్చుకుంటున్నామన్నారు. ఈ పెట్టుబడుల ద్వారా 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. 20 రంగాల్లో రాష్ట్రమంతటా పరిశ్రమలు వస్తాయన్నారు. ఇవాళ ఒక్కరోజే… 92 ఎంవోయులు 11.85 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని వీటి ద్వారా 4 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని జగన్ చెప్పారు. రేపు మరో 245 ఎంవోయుల అవగాహన జరుగుతుందని.. వాటి ద్వారా 1.15 లక్షలు పెట్టుబడులు వస్తాయని… మరో 2 లక్షల మంది ఉపాధి లభిస్తుందన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద పెద్ద కంపెనీలు రావడం సంతోషంగా ఉందన్నారు జగన్.

రిలయన్స్, అదానీ, ఆదిత్య బిర్లా గ్రూప్, రెన్యూ పవర్, అరబిందో, డాకిన్, ఎన్టీపీసీ, ఐవోసీఎల్, జిందాల్ గ్రూప్, శ్రీ సిమెంట్ ఇలా అనేక కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. ఇక త్వరలోనే పరిపాలన రాజధానిగా ఏపీ మారబోతోందన్నారు జగన్. విశాఖ త్వరలో పరిపాలన రాజధాని కాబోతుందన్నారు జగన్. తాను కూడా విశాఖ కేంద్రంగానే పాలన సాగించబోతున్నానన్నారు. పరిశ్రమలు పెట్టేవారందరికీ ఏపీ రెడ్ కార్పెట్ పరుస్తుందన్నారు సీఎం జగన్. ఈవెంట్ కు వచ్చినవారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. విశాఖ సమ్మిట్ ద్వారా, దేశీయంగా, అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు రాష్ట్రానికి లభిస్తాయన్నారు. పరిశ్రమలు స్థాపించాలనుకునేవారికి ఏపీలో ఎన్నో అవకాశాలున్నాయన్నారు. ఆరోగ్యకరమైన పోటీని ప్రభుత్వం కోరుకుంటుందన్నారు. ఏపీలో పరిశ్రమలు పెట్టడం ద్వారా దీర్ఘకాలిక వృద్ధిని తాము కోరుకుంటున్నామన్నారు.

విశాఖలో ఈవెంట్ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. విశాఖ ప్రకృతి రమనీయంగా ఉంటుందన్నారు. 2023 సెప్టెంబర్‌లో జీ 20 సదస్సు ఇండియాలో జరగబోతుందని.. కీలక సమావేశానికి విశాఖ వేదికవుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ముందుచూపుతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారన్నారు. ప్రపంచంలోనే ఇండియా శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. పెట్టుబడులకు స్వర్గధామంగా నిలుస్తోందన్నారు. దేశ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ పాత్ర కీలకమన్నారు. రాష్ట్రంలో పుష్కలంగా సహజవనరులున్నాయని… 974 కి.మీ మేర తీర ప్రాంతం ఏపీ సొంతమన్నారు. 6 పోర్టులుండగా.. మరో 4 ఏపీలో రాబోతున్నాయన్నారు. ఏపీలో 6 ఎయిర్ పోర్టుల్లో 3 అంతర్జాతీయ పోర్టులేనన్నారు. పరిశ్రమలకు తగిన స్కిల్డ్ యూత్ ఏపీలో పెద్ద ఎత్తున అందుబాటులో ఉన్నారన్నారు సీఎం జగన్. అన్నింటికీ మించి… వేగంగా రియాక్ట్ అయ్యే ప్రభుత్వం.. పరిశ్రమలకు వరమన్నారు. 11.43 జీఎస్‌డీపీ దేశంలోనే అత్యధికమన్నారు. మూడేళ్లుగా ఏపీ ఎగుమతులు 9.3 శాతం పెరిగాయన్నారు. నీతి అయోగ్ సైతం ఏపీకి కితాబిచ్చిందన్నారు.