తిరుమలకు వైఎస్ జగన్, రాష్ట్రవ్యాప్తంగా పాప ప్రక్షాళన పూజలు
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వ్యవహారం మలుపులు తీసుకుంటోంది. శ్రీవారి భక్తులు ప్రీతితో సేవించే లడ్డూల్లో జంతువుల కొవ్వు ఉందన్న వార్తలు భక్తులను కలచివేశాయి. ఈ నేపథ్యంలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్యదుమారం రేగుతోంది. వైసీపీ వల్లే తిరుమల అపవిత్రమైందని టీడీపీ వాదిస్తుంటే, టీడీపీ నేతల తీరు వల్లే తిరుమలకు కళంకం వాటిల్లిందంటూ వైసీపీ మాట్లాడుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. వైఎస్ జగన్ ఈనెల 28న తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేయనున్నారు. అదే రోజు, ఏపీ అంతటా పాప ప్రక్షాళన పూజలకు జగన్ పిలుపునిచ్చారు.

