చంద్రబాబును ముసలాయన అంటూ విరుచుకుపడ్డ వైఎస్ జగన్
ఏపీ సీఎం వైఎస్ జగన్.. టీడీపీ అధినేత చంద్రబాబుపై తొలిసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో ఎన్నికల్లో పొత్తులపై నా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులుండవని చెప్పారు. రాష్ట్రంలో తోడేళ్లంతా ఒక్కటవుతున్నారంటూ విరుచుకుపడ్డారు. మీ బిడ్డ సింహంలా ఒక్కడే పోరాడతాడంటూ జగన్ క్లారిటీ ఇచ్చారు. మీ బిడ్డకు పొత్తులుండవని, ఒక్కడిగానే పోరాడతాడన్నాడు. మీ బిడ్డకు భయం లేదన్నాడు. ముసలాయన మాదిరిగా తనకు దత్తపుత్రుడు మైక్ పట్టుకోకపోవచ్చన్నారు. తాను ఎస్సీలను, బీసీలను, ఎస్టీలను, నా మైనార్టీలను, నిరుపేద వర్గాలను మాత్రమే నమ్ముకున్నాడన్నాడు. రాష్ట్రంలో కులాల మధ్య యుద్ధం జరగడం లేదని.. పేదవాడికి, పెత్తందారుడికి మధ్య యుద్ధం జరుగుతుందన్నాడు జగన్.
రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని గిట్టనివాళ్లు అబద్ధాలు చెబుతున్నారని జగన్ విరుచుకుపడ్డారు. కోటి మంది రైతులకు, కోటి మంది మహిళలకు సాయం చేసిన ప్రభుత్వం ఇదన్నారు. అమ్మ ఒడి, సున్నా వడ్డీ, ఆసరా ద్వారా పేదలకు సాయం అందిస్తున్నామన్నారు. గతంలో కంటే ప్రస్తుతం తమ సర్కారు చేస్తోన్న అప్పులు తక్కువేనన్నారు. గతంలో ఎందుకు బటన్లు లేవన్నారు. లక్షా 92 వేల కోట్లు ప్రజల ఖాతాల్లోకి ఎందుకు వేయలేదన్నారు. మీ బిడ్డ పాలనలోనే పేదలకు సంక్షేమం అందిస్తున్నామన్నారు. గతంలో దుష్టచతుష్టయం పేదల సొమ్మును దోచుకుతుందన్నారు జగన్. వినుకొండలో జరిగిన కార్యక్రమంలో జగనన్న చేదోడు పథకం నిధులను లబ్ధిదారుల ఎకౌంట్లో బటన్ నొక్కి జమచేశారు.