ఆన్ లైన్ బెట్టింగ్‌ల వల్ల యువకుడి ప్రాణాలు బలి…
ఖమ్మం నగరంలోని వైఎస్సార్ నగర్‌కు చెందిన షేక్ అజీజ్ (29) హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఆన్ లైన్ బెట్టింగ్‌లకు పాల్పడుతూ స్నేహితులతో పాటు బంధువుల వద్ద అధిక మొత్తంలో అప్పులు చేసి ఆన్ లైన్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో అప్పు ఇచ్చిన వారికి సమాధానం చెప్పుకోలేక ఖమ్మంలోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాను పడే బాధను సెల్ఫీ వీడియో లో చెబుతూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.