చంద్రబాబుతో వెళ్లిపోతున్నానని చెప్పడానికే పవన్ సభ వైసీపీ కౌంటర్
◆సొంత కార్యకర్తలను నమ్మలేని వాడు పవన్
◆ పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని ఫైర్
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై పేర్ని నాని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. నోటి జాడింపు మానుకుంటే మంచిది లేదంటే మాకు కూడా చెప్పులు ఉన్నాయని పవన్ కళ్యాణ్ కళ్యాణ్ పైన ఘాటు వ్యాఖలు చేసారు. తాడేపల్లిలో జరిగిన విలేఖర్ల సమావేశం లో ఆయన మాట్లాడుతూ..అసభ్య పదజాలంతో యువతకు ఏం సందేశం ఇవ్వదలచుకున్నావు అని పవన్ కళ్యాణ్ ని అన్నారు. స్టేజీ మీద బీసీలను ఎందుకు కూర్చోబెట్టలేదో చెప్పాలని సూటి ప్రశ్న వేశారు. చంద్రబాబు నాయుడితో ఆయనకు ఉన్న సంబంధం ఏంటంటే దత్త తండ్రితో దత్త కొడుకుకి ఉన్న సంబంధం అని ఉన్న మాటను జగన్ చెప్తే ఎందుకు ఉలిక్కిపడతావు అని ఎద్దేవా చేసారు. రాష్ట్రాన్ని 14 ఏళ్లు దోచుకున్న చంద్రబాబు పంచన చేరి నీతి వాక్యాలు చెబుతున్నావని ఇంతకీ పవన్ ఏ పార్టీతో ఉంటాడో ఆయనకే క్లారిటీ లేదన్నారు.

అన్నయ్య పార్టీని వదిలేసి, సొంత పార్టీ పెట్టుకుని బిజెపితో తిరిగి ఆ తర్వాత సీపీఎం, సీపీఐ తో తిరిగి ఇప్పుడు మళ్లీ చంద్రబాబుతో పవన్ తిరుగుతున్నాడని. దీన్ని రాజకీయ వ్యభిచారం అనే అంటారని అన్నారు. మైక్ దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు హర్షించరన్న విషయాన్ని గుర్తేరిగితే మంచిదని చురకలంటించారు. ఒంటరిగా వెళ్లి వీర మరణం పొందలేనని బహిరంగంగానే చెప్పిన పవన్ ముసుగు తొలగించేసాడన్నారు పూటకో మాట మాట్లాడే పవన్ సినిమా వాళ్లు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాడని దీనివల్ల జనసేన కార్యకర్తలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు.