పల్నాడులో రగులుతున్న రాజకీయం, జగన్‌ను ఎండగట్టిన ఎమ్మెల్సీ జంగా
వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. నామమాత్రపు పదవులు బీసీలకు, ఇచ్చి కీలుబొమ్మలులాగా ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు. పల్నాడులో వాడి వేడిగా రాజకీయం మారుతున్నట్టుగా కన్పిస్తోంది. గత కొద్ది రోజులుగా జంగా టీడీపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. అన్నీ విధాలా బీసీలను మోసం చేస్తున్న పార్టీ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటూ ఆయన మండిపడ్డారు. వైస్సార్ సీపీ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఉండి జంగా కృష్ణమూర్తి యాదవ్ ఆరోపణలు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగుతోంది. పవర్ లేని పదవులను బీసీలకు ఇచ్చి సామాజిక న్యాయం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది అని, తీవ్ర పదజాలంతో విమర్శించారు. రాష్ట్రంలో పెత్తనమంతా తన రెడ్డి సామాజికవర్గం చేతిలో పెట్టి కేవలం కీలుబొమ్మలుగా ఆడించడమే కాకుండా బడుగు, బలహీన వర్గాల వారిని చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలను రాజకీయంగా నట్టేట ముంచేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, బీసీలు ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపొద్దని పిలుపు నిచ్చారు.

