Andhra PradeshHome Page Slider

టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి

వైసీపీ నుంచి టికెట్ రాకపోవడంతో, ఆ పార్టీ పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి టీడీపీ తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయించారు. కృష్ణా జిల్లాలో టీడీపీ తనకు టికెట్ కేటాయిస్తే ఆయన ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయాలని భావిస్తున్న పార్థసారధి, జగన్ షాకివ్వడంతో పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు.