బర్త్ డేకి “పార్టీ లేదా పుష్ప”
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తన ప్రతీ సినిమాలోను కొత్త పాత్రలు,స్టైల్,డ్యాన్స్‌తో టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తారు. అందుకే ఆయనను తన అభిమానులంతా ప్రేమగా “స్టైలీష్ స్టార్” అని పిలుచుకుంటారు. కాగా ఈరోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు. దీంతో ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. గత ఏడాదిలో విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించింది. అంతేకాకుండా అల్లు అర్జున్ కెరీర్‌లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ రోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప టీమ్ నిన్న పుష్ప-2 ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. కాగా ఈ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది.