Andhra PradeshHome Page Slider

20న జరిగే లోకేష్ యువగళం ముగింపు సభకు రాలేను: పవన్ కళ్యాణ్

ఏపీ: ఈ నెల 20న విజయనగరం జిల్లాలో జరిగే లోకేష్ యువగళం ముగింపు సభకు రాలేకపోతున్నట్లు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. వేరే కార్యక్రమాల వల్ల కుదరడం లేదని టీడీపీ నేతలకు సమాచారం ఇచ్చారు. రెండు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి వస్తానని తెలిపారు. కాగా, సభకు బాలకృష్ణ, పవన్ హాజరవుతున్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.