Home Page SliderTelangana

తెలంగాణాలో 27 మంది మహిళలకు మహిళా దినోత్సవ పురస్కారాలు

వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన, విశేష సేవలందిస్తున్న 27 మంది మహిళలను తెలంగాణా ప్రభుత్వం సత్కరించనుంది. రేపు (మార్చి8 ) అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా తెలంగాణా రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలు ప్రకటించింది. ఈ అవార్డుతో పాటు ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయల నగదు బహుమతిని కూడా అందజేస్తున్నారు. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి భారతి హోళీకేరి ఈఉత్తర్వులు జారీచేశారు. ఈ పురస్కారం పొందబోతున్న మహిళలలో  అంగన్ వాడీ టీచర్లు, సోషల్ వర్కర్లు, జర్నలిస్టులు, సంగీతం, పోలీస్, క్రీడలు మొదలైన రంగాలకు చెందిన వారు ఉన్నారు.