9 మహిళల ఆసియా కప్..అభిమానులకు ఫ్రీ ఎంట్రీ
మహిళల ఆసియా కప్ టీ 20 టోర్నీలు జూలై 19 నుండి శ్రీలంకలో జరగనున్నాయి. ఈ పోటీల సందర్భంగా బీసీసీఐ అభిమానులకు గొప్ప అవకాశాన్ని కల్పించింది. ఈ టోర్నీలో అన్ని మ్యాచ్‌లు అభిమానులు ఉచితంగా చూడవచ్చని, ఎలాంటి ప్రవేశ రుసుము లేకుండా ఫ్రీ ఎంట్రీ కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ మ్యాచ్‌లు సెమీ ఫైనల్స్, ఫైనల్స్‌తో కలిపి మొత్తం 15 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. జూలై 19 నుండి ప్రారంభమై జూలై 28న ఫైనల్ మ్యాచ్‌తో ముగుస్తాయి. జూలై 19న భారత్, పాకిస్థాన్ ఢీకొననున్నాయి. దీనితో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఉచిత ప్రవేశం ఉండడంతో ఈమ్యాచ్‌లకు అభిమానులు పోటెత్తే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లలో గ్రూప్ ఏలో భారత్, పాకిస్థాన్, నేపాల్, యూఏఈ ఉన్నాయి. గ్రూప్ బీలో శ్రీలంక, బంగ్లాదేశ్, థాయ్‌లాండ్, మలేషియా ఉన్నాయి. భారత్ టీమ్‌లో కెప్టన్‌గా హర్మన్ ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధాన ఉన్నారు. షఫాలీ వర్మ, దీప్తి శర్మ, రిచా ఘోష్, పూజ వస్త్రాకర్, ఉమా చెత్రీ, అరుంధతి రెడ్డి వంటి ప్లేయర్లు ఆడనున్నారు.