గాయంతో స్టార్ క్రికెటర్ వరల్డ్ కప్ మ్యాచ్‌కి దూరమవుతారా?
ప్రస్తుతం దేశమంతటా వరల్డ్ కప్ మ్యానియా నడుస్తోంది. వరల్డ్ కప్‌ను కైవసం చేసుకునేందుకు జట్టులన్నీ తీవ్రంగా శ్రమిస్తూ ఆటలో సత్తా చాటుతున్నాయి. ఈ క్రమంలో న్యూజిలాండ్ టీమ్‌కు గట్టి షాక్ తగిలింది. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వేలికి ఫ్రాక్చర్ అయ్యినట్లు తాజాగా వచ్చిన రిపోర్ట్‌లో తేలింది. కాగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేన్ గాయపడ్డారు. దీంతో అతని ఎడమచేతి బొటనవేలు ఎముక చిట్లినట్టు వైద్యులు నిర్థారించారు. అయితే అతడు ప్రస్తుతం జట్టుకు అందుబాటులోనే ఉన్నాడు. కానీ అతను మ్యాచ్ ఆడతాడా లేదా అన్న దానిపై సందిగ్దం నెలకొంది. ఈ నేపథ్యంలో కేన్‌కు ప్రత్యమ్నాయంగా టామ్ బ్లండెల్ ఇండియాకు రానున్నట్లు తెలుస్తోంది.