కేటీఆర్ ఏమైనా ఆత్మహత్య చేసుకుంటాడా?
తెలంగాణలో ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయి? కేటీఆర్ ఏమైనా ఆత్మహత్య చేసుకుంటాడా? సిరిసిల్లకు ఉప ఎన్నిక రావడానికి? అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రేవంత్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీ.ఆర్.ఎస్.శ్రేణులు సీఎంపై ఘాటుగా స్పందిస్తుండగా…కాంగ్రెస్ వర్గాలు కూడా అంతే స్థాయిలో రెచ్చిపోతున్నారు.కేటిఆర్ వాడుతున్న భాష సరైంది కాదని,ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కేటిఆర్ లా ఎవరూ దుర్భాషించడం లేదని చెబుతున్నారు.కేటిఆర్ అన్నీ రాజకీయ వేదికల మీద సీఎంని విపరీతంగా తులనాడుతున్నారని ఫైర్ అవుతున్నారు.ఇదిలా ఉండగా…. విమర్శలు మితిమీరి చేయడం సమంజసం కాదని బీ.ఆర్.ఎస్.శ్రేణులు హితవు పలుకుతున్నారు.కేటిఆర్ ఆత్మహత్య చేసుకుంటాడా ఏందీ అని సీఎం స్థాయి వ్యక్తులు మాట్లాడటం దురదృష్టకరమని చెబుతున్నారు.ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఉద్యమ నాయకుడిగా మాట్లాడటం తగదన్నారు.