నీళ్ల కోసం యుద్ధం చేస్తా.. జగన్ సర్కారుపై శింగనమల ఎమ్మెల్యే పద్మావతి
వైసీపీ శింగనమల ఎమ్మెల్యే జగన్ సర్కారుపై తిరుగుబావుటా ఎగురేశారు. నియోజకవర్గంలో నీళ్ల కోసం యుద్ధం చేయాల్సి వస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ కుప్పం నియోజకవర్గానికి నీళ్లిస్తున్నారని, శింగనమలకు నీళ్లివ్వడం లేదని విమర్శించారు. ఎస్సీ మహిళ, ఎమ్మెల్యే కూడా నోరు విప్పి మాట్లాడొద్దని హెచ్చరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి సీఎం జగన్ సహకరించలేదని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్టు నడుచుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. మాట తప్పను.. మడమ తిప్పనన్న సీఎం.. పెద్దిరెడ్డి చెప్పినట్టుగా నడుచుకుంటున్నారని… వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం లేదని సీఎం చెప్పారని.. అయితే టికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా… ఎలాంటి స్పందన లభించలేదని ఆమె విమర్శించారు. వన్ టైమ్ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశానన్నారు. తనకు టికెట్ ఇస్తారా ఇవ్వరా అన్నది జగనన్నే చెప్పాలన్నారు పద్మావతి.