అవకాశం కోసం ఏ పనైనా చేస్తాను…….!నటి ప్రియాంక మోహన్
తెలుగు, తమిళ భాషల్లో అనేక చిత్రాల్లో యాక్ట్ చేస్తున్న ప్రియాంక మోహన్ చెప్పిన మాటలు ప్రసుత్తం వైరల్ అవుతున్నాయి. కొద్దిరోజులుగా సరిపోదా శనివారం మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు. ఈనెల 24న మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ప్రీ రిలీజ్ వేడుకలో ప్రియాంక మాట్లాడుతూ, ఎస్జే సూర్యను ఓ రిక్వెస్ట్ చేసింది. మళ్లీ మీరు ఎప్పుడు డైరెక్షన్ చేస్తారు..? ఒకవేళ చేస్తే ఖుషి 2ను చేయండి. అది కూడా పవన్ కళ్యాణ్ సర్ తోనే చేయండి అంటూ స్టేజ్ మీద ఓపెన్ గా ఆమె మనసులో ఉన్న మాట అందరి ముందు చెప్పేసింది. ప్రసుత్తం తాను చేసిన కామెంట్స్ పై అడియన్స్ మండిపడుతున్నారు. ఆఫర్స్ కోసమే ఇలా మాట్లాడిందంటూ నెట్టింట ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఇవే మాటలపై తమిళ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తమిళంలో విజయ్ దళపతి, జ్యోతిక కలిసి నటించిన ఒరిజినల్ సినిమా ఖుషి. ఆ సినిమానే పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేశారు. ఒరిజినల్ సినిమా కంటే రీమేక్ చేసిన సినిమానే బాగుందని చెప్తావా..? ఒకవేళ పార్ట్ 2 తీస్తే పవన్ కళ్యాణ్ తో తీయాలని సలహా ఇస్తావా అంటూ ప్రియాంక మీద తమిళ అడియన్స్ ఫైర్ అవుతున్నారు.