భర్తను రెడ్ హ్యాడెండ్ గా పట్టుకున్న భార్య
మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తను రెడ్ హ్యాడెండ్ గా భార్య పట్టుకుంది. భార్యను చూసిన భర్త గోడ దూకి పారిపోయాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా హయాత్ నగర్ లో చోటు చేసుకుంది. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను భార్య చితకబాదింది. తన తండ్రి మరణిస్తే వచ్చిన డబ్బులు తీసుకుని వ్యాపారం పెడతానని చెప్పి రూ.30 లక్షల నగదు, కారు, స్కూటీ, బంగారాన్ని ఆ మహిళకు తన భర్త ఇచ్చాడని భార్య ఆరోపిస్తోంది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.