బాలయ్య అన్ స్టాపబుల్ షోకు రోజా వెళ్లాలనుకున్నారా?
మెగా ఫ్యామిలీపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ఏపీ మంత్రి రోజా. మెగా ఫ్యామిలీతో పెట్టుకుంటే సినిమాల్లో ఛాన్స్‌లు రావని చిన్న చిన్న ఆర్టిస్టులు భయపడుతున్నారన్నారు. ఆర్టిస్టులను బెదిరించి తిట్టిస్తున్నారని విమర్శించారు. పొలిటికల్ జోకర్స్ మాటలను పట్టించుకోనక్కర్లేదన్నారు. మెగా ఫ్యామిలీ మెప్పు కోసం కొందరు తనను టార్గెట్ చేస్తున్నారన్నారు. మెగా ఫ్యామిలీలో ఆరుగురు హీరోలున్నారని… తనను తిడితే అవకాశాలు వస్తాయని కొందరు పోటీ పడుతున్నారన్నారు. మెగా ఫ్యామిలీ వల్ల రాష్ట్రానికి ఏం మంచి జరగలేదు కాబట్టి ఓడిపోయారన్నారు. పవన్ చంద్రబాబు సంక ఎక్కుతున్నారన్నారు. బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి వెళ్దామనుకున్నా… చంద్రబాబు షోకు వచ్చాక, ఆ షోపై ఆసక్తి పోయిందన్నారు రోజా. పవన్, లోకేశ్ యాత్ర వల్ల రాష్ట్రానికి ఒరిగేదేం లేదన్నారు.
