Home Page SliderTelangana

తెలంగాణాలో పరీక్షలు ఎందుకు వాయిదా వేయడం లేదంటే..?

తెలంగాణాలో డీఎస్సీ,గ్రూప్-2,3 పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే.కాగా దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సీఎం మాట్లాడుతూ..రాష్ట్రంలోని కొన్ని రాజకీయ శక్తులు,కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు పోటీ పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు.తెలంగాణాలో పదేళ్లుగా ఉద్యోగ నోటీఫికేషన్లు లేవు.అయితే ఇప్పుడు పక్కాగా డీఎస్సీ,గ్రూప్-2,3 పరీక్షలు నిర్వహిస్తుంటే వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పోటీ పరీక్షలు పూర్తయితే ఉద్యోగాలు పొందని వారు వేరే ఉద్యోగాలు చూసుకుంటారు.అందుకే పరీక్షలను వాయిదా వేయడం లేదన్నారు. అయితే ఏ పరీక్షలు రాయనివారు దీక్షలు చేపట్టడం ఆశ్చర్యంగా ఉందని సీఎం పేర్కొన్నారు.