Home Page SliderNational

ఢిల్లీలో కాబోయే సీఎం ఎవరు..?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతుండడంతో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కనిపిస్తోంది. బీజేపీ 47 స్థానాల్లో.. ఆప్ 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. 27 ఏళ్ల తర్వాత బీజేపీ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తున్నట్లు కనిపిస్తోంది. బీజేపీ పార్టీ ఎన్నికల్లోగెలిస్తే, ఆ పార్టీ తదుపరి సీఎం ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

బీజేపీ పార్టీ ముఖ్యనేత మనోజ్ తివారీని సీఎం రేసులో ముందు వరుసలో ఉన్నారు. మనోజ్ తివారీ పూర్వాంచల్ ప్రాంతానికి చెందిన ముఖ్య నాయకుడిగా ఉన్నారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలను కూడా నిర్వహించారు. ఆయన రెండు సార్లు ఎంపీగా ఉన్నారు. ఢిల్లీ పూర్వాంచల్ ఓట్లను ఏకం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు.

ఢిల్లీ రోహిణి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయేందర్ గుప్తా కూడా సీఎం అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పాత్రను బాగా పోషించారు. పార్టీ కేడర్, అధిష్టానంలో ఆయనకు బలమైన పట్టు ఉందని భావిస్తారు. బీజేపీ గెలిస్తే, ఆ పార్టీ విజేందర్ గుప్తా వైపు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదు.

బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షులు వీరేంద్ర సచ్ దేవా పేరు కూడా ముఖ్యమంత్రి పదవి రేసులో వినిపిస్తోంది. ఢిల్లీలో బీజేపీ విజయంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఢిల్లీలో పార్టీ గెలిస్తే, ముఖ్యమంత్రి అభ్యర్థిగా వీరేంద్ర సచ్ దేవా పేరు కూడా తెరపైకి రావచ్చు.