Home Page SliderNational

కొత్త పార్లమెంటులో తొలి సమావేశాలు ఎప్పుడంటే..?

ఇటీవల భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో కొత్త పార్లమెంటు భవనాన్ని ఘనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ భవనంలో త్వరలోనే తొలి సమావేశాలు జరగబోతున్నాయి. కాగా వచ్చే నెల 17 నుంచి ఆగస్టు 10 వరకు పార్లమెంట్‌లో వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఢిల్లీ పరిపాలనాధికారాల బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఉమ్మడి పౌరస్మృతిపై కూడా వాడీ వేడీ చర్చ జరగే అవకాశం కన్పిస్తోంది.