ఏపీలో టెన్త్,ఇంటర్ పరీక్షలు ఎప్పుడంటే..?
ఏపీలో టెన్త్,ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌పై విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో టెన్త్,ఇంటర్ పరీక్షలు మార్చిలోనే జరుగుతాయని స్పష్టం చేశారు. కాగా వచ్చే ఏడాదిలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే విద్యార్థుల పరీక్షలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది అన్నారు. దీని కారణంగానే ఏపీలో టెన్త్,ఇంటర్ పరీక్షలను మార్చిలోనే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.