VRA లతో KTR చర్చలు ఫలించిన వేళ
తెలంగాణాలో గతకొన్ని రోజులుగా VRAలు ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని నిరసనలు చేపట్టారు. అయితే వీటిపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవడంతో వారు ఆందోళనలను తీవ్రతరం చేశారు. ఈ రోజు అసెంబ్లీని ముట్టడించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వారు ఇందిరాపార్క్ నుంచి అసెంబ్లీ వరకు నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలలో భాగంగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఈ రోజు అసెంబ్లీ దగ్గర ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు. ఈ ఆందోళనలు చెదరగొట్టడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు. అయినప్పటికీ VRAలు తమ నిరసనలు విరమించుకోక పోవడంతో తెలంగాణ మంత్రి KTR రంగంలోకి దిగారు. ఈ మేరకు ఆయన వారితో కాసేపు చర్చలు జరిపారు. ఈ చర్చలలో భాగంగా KTR త్వరలోనే VRA సమస్యలను పరిష్కారిస్తామన్నారు. అంతేకాకుండా సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. VRAల సమస్యలపై సీఎం కేసీఆర్తో మాట్లాడి, పే స్కేలు ప్రకారం VRAలకు జీతాలు చెల్లించేలా చూస్తామని హామీ ఇచ్చారు. అదృష్టవశాత్తు ఈ చర్చలు ఫలించాయి. దీనికి తెలంగాణా రాష్ట్రంలోని VRAలు అందరూ..సానుకూలంగా స్పందించారు. దీంతో రేపటి నుంచి శాంతియుతంగా సమ్మె చేపడతామని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు కూడా VRAలు స్పష్టం చేశారు.

