జగన్ ప్రమాణస్వీకారం ఎప్పుడంటే.. తేల్చి చెప్పిన వైవీ
ఏపీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండో సారి విశాఖలో జూన్ 9న ఉదయం 9 గంటల 38 నిమిషాలకు రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పారు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండోసారి విజయం ఖాయమన్నారు వైవీ. జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని నిరుపేదలు భావించారన్నారు. ముఖ్యంగా మహిళలు, నిరుపేదలు, వృద్ధులు, వికలాంగులు వైసీపీకి ఓటేశారన్నారు. జగన్ గెలిస్తే పథకాలొస్తాయన్న నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. జూన్ 4, 2024న ఓట్ల లెక్కింపు జరిగే సమయంలో YSRCP పెద్ద విజయాన్ని సాధిస్తుందని అంచనా వేస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం ఖాయమని, జూన్ 4న జరిగే ఫలితాలు యావత్ దేశాన్ని తలదించుకుని ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేస్తాయని చెప్పారు. 2019లో 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాలు గెలుచుకున్నామని, ఈసారి మరింత మెరుగైన ప్రభుత్వాన్ని అందజేస్తామని జగన్ అన్నారు.
