Home Page SliderInternational

లెబనాన్‌లో పేజర్లు పేలడానికి, వాయ్‌నాడ్‌ కుర్రాడికి లింకేంటి?

ఇటీవల లెబనాన్ కేంద్రంగా సాగుతున్న పేజర్లు, వాకీటాకీల పేలుళ్ల వెనుక ఇజ్రాయెల్ ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఒకే ప్రాడెక్ట్ ఎవరు తయారు చేసినా నేరం వాళ్ల మీదకే వెళ్తుందా.. అంటే అదే జరిగింది నార్వేలో సెటిలైన భారతీయ వ్యాపారి వ్యవహారం. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ ఆగడాలపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు రేగుతున్నాయ్. అదే సమయంలో ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ పాత్రపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ పేలుళ్ల వెనుక ఓ భారతీయుడున్న చర్చ నార్వే నుంచి మొదలైంది. లెబనాన్‌లో 12 మందిని హిజ్బుల్లా గెరిల్లాలు మృతి చెందడానికి కారణంపై దర్యాప్తు కొనసాగుతోంది.

నార్వేకు వలస వచ్చిన భారతీయుడి పేరు వెలుగులోకి వచ్చింది. రిన్సన్ జోస్ కేరళలోని వాయనాడ్ నుండి వలస వెళ్లి నార్వే పౌరుడయ్యాడు. బల్గేరియా కంపెనీ పేజర్లను ఉగ్రవాద సంస్థకు సరఫరా చేయడంలో పాలుపంచుకున్నట్లు నివేదికలు విడుదలయ్యాయి. ప్రతి పేజర్‌లో మూడు గ్రాముల పేలుడు పదార్థాలను ఇజ్రాయెల్ సీక్రెట్ ఏజెన్సీ మొస్సాద్‌ ద్వారా ప్లాంట్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. తైవాన్‌కు చెందిన గోల్డ్ అపోలో అనే కంపెనీ తయారు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. అయితే, పేలుడులో ఉపయోగించిన పేజర్ మోడల్, AR-924, వాస్తవానికి హంగేరీలోని బుడాపెస్ట్‌లో ఉన్న BAC కన్సల్టింగ్ KFT ద్వారా విక్రయించినట్టు మరో అంశం వెలుగులోకి వచ్చింది. ఇది ట్రేడ్‌మార్క్‌ను ఉపయోగించే అధికారం కలిగి ఉందని కంపెనీ తెలిపింది.

పేజర్లు పేలిన రెండు రోజుల తర్వాత, గురువారం, బల్గేరియన్ భద్రతా సంస్థ DANS, ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ పేజర్ల తయారీ కంపెనీ పాత్రను పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఆ కంపెనీ నార్టా గ్లోబల్ లిమిటెడ్ కంపెనీగా గుర్తించారు. 2022లో సోఫియాలో రిజిస్టర్ చేయగా, కంపెనీ రిన్సన్ జోస్ యాజమాన్యంలో ఉన్నట్లు తేలింది. ఐతే వాస్తవానికి లెబనాన్‌ పేలుళ్లలో ఉపయోగించిన పేజర్‌లు బల్గేరియాలో దిగుమతి, ఎగుమతి లేదా తయారు చేయలేదని తేలింది. నార్వేలోని
మొత్తం వ్యవహారంపై ఓస్లో పోలీసుల దర్యాప్తులు విషయం వెల్లడైంది.

వార్తా సంస్థ IANS నివేదిక ప్రకారం, జోస్ కొన్నేళ్ల క్రితం ఉన్నత చదువులు చదవడానికి నార్వే వెళ్లాడు. ఓస్లోకు వెళ్ళే ముందు కొంతకాలం లండన్‌లో పనిచేశాడు. లింక్డ్‌ఇన్ ప్రకారం, నార్వేజియన్ ప్రెస్ గ్రూప్ DN మీడియా డిజిటల్ కస్టమర్ సపోర్ట్‌లో దాదాపు ఐదేళ్లు పనిచేశాడని AFP నివేదించింది. DN మీడియా వార్తా పత్రిక వెర్డెన్స్ గ్యాంగ్‌తో మాట్లాడుతూ, తాను మంగళవారం నుండి విదేశీ పర్యటనలో ఉన్నానన్నాడు. జోస్ తన భార్యతో ఓస్లోలో స్థిరపడ్డాడని, అతనికి లండన్‌లో ఒక కవల సోదరుడు ఉన్నారని బంధువులు IANSకి తెలిపారు. “మేము రోజూ ఫోన్‌లో మాట్లాడుతాం. అయితే, గత మూడు రోజులుగా, మాకు జోస్‌తో ఎటువంటి చర్చలు జరగలేదు. అతను ముక్కుసూటి వ్యక్తి, అతనిని పూర్తిగా విశ్వసిస్తాం. అతను ఏ తప్పులో భాగం కాడు.” అవసరంగా అతన్ని పేలుళ్ల కేసులో ఇరికించారని 37 ఏళ్ల బంధువు థంకచెన్ శుక్రవారం వార్తా సంస్థతో అన్నారు. జోస్ భార్యను కూడా తాము సంప్రదించలేకపోయామని ఆయన తెలిపారు. జోస్ స్థాపించిన నోర్టా గ్లోబల్, గత సంవత్సరం యూరోపియన్ యూనియన్ వెలుపల కన్సల్టింగ్ కార్యకలాపాల కోసం $ 725,000, సుమారు ₹ 6 కోట్లు ఆదాయాన్ని ప్రకటించింది.