కాంగ్రెస్ నేతలపై ఈడీ మౌనానికి కారణమేంటో?.. కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ నేతలపై ఈడీ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. ఎవరో ఈడీ నుండి కాంగ్రెస్ నేతలను కాపాడుతున్నారని పేర్కొన్నారు. ఢిల్లీలో ఒకరకంగా వ్యవహరిస్తూ, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు సయోధ్య పాటిస్తున్నారని విమర్శించారు. అందుకే బీజేపీ నేతలు మౌనంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. మంత్రి పొంగులేటిపై ఈడీ దాడులు జరిపి వందలకోట్ల రూపాయలు దొరికాయని చెప్పినా, ఎలాంటి చర్యలు లేవన్నారు. అలాగే, కర్ణాటక నుండి తెలంగాణకు రూ.40 కోట్లు అక్రమధనం వచ్చిందని తనిఖీలలో బయటపడినట్లు ఈడీ వెల్లడించినా కూడా ఏ కేసు లేదన్నారు. దీనితో ఈ విషయాలపై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.