పుష్ప 2 తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే..?
సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప 2 ది రూల్’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సందడి చేస్తోంది. ప్రీ సేల్ బుకింగ్స్ లోనే హవా చూపిన ఈ సినిమా మొదటిరోజు వసూళ్లలోనూ సత్తా చాటింది. డిసెంబర్ 4 రాత్రి నుంచి థియేటర్లలో సందడి చేసిన ‘పుష్ప 2’ కలెక్షన్ల పరంగా ఓవర్సీస్ లోనూ టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. తొలిరోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.175 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల వాటా ఎక్కువ ఉన్నట్లు సమాచారం. అమెరికాలో ఈ చిత్రం తొలిరోజు దాదాపు 4.2 మిలియన్ల డాలర్లు (రూ.35 కోట్లు పైన) వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. ఈ విషయాన్ని తెలుపుతూ పోస్టర్ విడుదల చేసింది. అమెరికాలో ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన మూడో భారతీయ చిత్రంగా నిలిచింది.