స్టేట్ ర్యాంక్ సాధించిన కుమార్తెను తండ్రి ఏం చేశాడంటే..
బీహార్లోని 12వ తరగతి బోర్డు పరీక్షల ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. సంజనాకుమారి అనే బాలిక బీహార్ రాష్ట్రంలో అంజనా కోట్ అనే గ్రామంలో ఉంటోంది. ఆమె రాష్ట్రంలో ఆర్ట్స్ గ్రూపులో 5 వ ర్యాంకులో సాధించింది. ఆమె తండ్రి పెళ్లిళ్లలో మేళతాళాలు వాయించే వ్యక్తి. తన కుమార్తె స్టేట్ ర్యాంక్ సాధించిన ఆనందంతో ఆయన ఆమెను మేళతాళాలతో ఊరేగించి సంబరాలు జరపడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాను పరీక్షలకు ముందు 10 నుండి 12 గంటల పాటు చదివానని, భవిష్యతులో ఐఏఎస్ కావాలని తన ఆశయం అని ఆమె పేర్కొంది.

