‘వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఫ్యామిలీయే మా ధ్యేయం’..చంద్రబాబు
ఏపీ ఆర్థిక వృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజల తలసరి ఆదాయాలు పెంచడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతీ వ్యక్తి, కుటుంబం, సమాజం ఆనందంగా ఉండాలని, వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఫ్యామిలీ నినాదంతో తమ ప్రభుత్వం ముందుకెళుతోందన్నారు. 2047 నాటికి 42 వేల డాలర్ల తలసరి ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించడానికి, పేదలను ఆర్థికంగా పైకి తీసుకురావడానికి కార్యక్రమాలు చేపడుతున్నామని, ధనికులు తమ శక్తి సామర్థ్యాల మేరకు కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సంపద సృష్టిలో పబ్లిక్ – ప్రైవేట్ పార్టనర్ షిప్ గేమ్ ఛేంజర్‌గా మారబోతోందన్నారు.

