Home Page SliderNational

బీహార్‌లో 40 లోక్‌సభ స్థానాలూ గెలుస్తాం- అమిత్ షా జోస్యం

2024 సార్వత్రిక ఎన్నికల్లో బీహార్‌లోని మొత్తం 40 లోక్‌సభ స్థానాలను ఎన్డీయే కైవసం చేసుకుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం జోస్యం చెప్పారు. బీహార్‌లోని మధుబని జిల్లాలోని ఝంఝార్‌పూర్‌లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి హోంమంత్రి మాట్లాడుతూ, బీహార్‌లో 2019 ఎన్నికల్లో ఎన్‌డిఎ 39 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుందని, వచ్చే ఏడాది ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయం సాధించడం ద్వారా ‘అన్ని రికార్డులను బద్దలుకొట్టాలని’ చూస్తోందని అమిత్ షా చెప్పారు. 2019లో 39 సీట్లు గెలిచామని, ఈసారి అన్ని రికార్డులను బద్దలు కొట్టి 40 సీట్లు గెలుస్తాం’’ అని షా ఆశాభావం వ్యక్తం చేశారు.