ప్రతీకారం తీర్చుకుంటాం.. ఉగ్రవాది వార్నింగ్..
పాకిస్తాన్‌లో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించలేదని పాక్ రక్షణ మంత్రే స్వయంగా వెల్లడించారు. అయితే పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు బహిరంగంగా ర్యాలీలు చేస్తున్నారు. మసూద్ అజార్ కుటుంబంలో 12 మంది చనిపోయారని.. వారిలో ఐదుగురు చిన్న పిల్లలున్నారని, దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఓ ఉగ్రవాది బహిరంగంగానే హెచ్చరించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.