ఏ కూటమిలోనూ చేరబోం
ఇండియా కూటమి, ఎన్డీఏకు తమ పార్టీ సమాన దూరంలో ఉంటుందని వైసీపి సీనియర్ నేత ,రాజ్య సభ సభ్యులు వి.విజయ సాయిరెడ్డి తెలిపారు.మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ ఏ కూటమికీ మద్దతు ఇవ్వదని తెలిపారు. తమది న్యూట్రల్ స్టాండ్ అని స్పష్టం చేశారు ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’పై తమ పార్టీ అధ్యక్షుడి అభిప్రాయమే చెబుతామని, ప్రాంతీయ పార్టీగా ఏపీ ప్రయోజనాలే వైసిపికి ముఖ్యమని విజయ సాయి వివరించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపి కచ్చితంగా విజయబావుటా ఎగురవేసి తీరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.