కేసీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం
మాజీ సీఎం కేసీఆర్ అజెండాను తెలంగాణ జాగృతి తరపున ముందుకు తీసుకెళ్తామని సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా జాగృతి కార్యాలయంలో కాళోజీ చిత్రపటానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు.
ఆనంతరం కవిత మాట్లాడుతూ, “ఉన్నతమైన ఆశయాలతో ముందుకు సాగాలని ఆలోచిస్తున్నాం. ఉన్నతమైన లక్ష్య సాధన దిశగా సంప్రదింపులు జరుగుతున్నాయి. సామాజిక తెలంగాణ సాధించే వరకు జాగృతి కార్యకర్తలు విశ్రమించరు. సామాజిక తెలంగాణ సాధన కోసం అందరినీ కలుపుకుని సాగిపోతాం. కేసీఆర్ అజెండాను తెలంగాణ జాగృతి తరపున ముందుకు తీసుకెళ్తాం. కాళోజీ స్పూర్తితోనే ఇంతవరకు పని చేశాం, ఇకముందూ అదే స్పూర్తితో కొనసాగిస్తాం. ఎల్లప్పుడూ అన్యాయాన్ని ఎదుర్కొనే ధైర్యం అవసరం” అని పేర్కొన్నారు.