‘మనం ఫెయిలయ్యాం’..పాక్ రక్షణమంత్రి
భారత్ డ్రోన్లు, మిసైల్స్ దెబ్బకి పాకిస్తాన్ విలవిల్లాడుతోంది. ఈ విషయాన్ని స్వయంగా పాక్ రక్షణమంత్రే పార్లమెంట్‌లో అంగీకరించారు. తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ విఫలమయ్యిందని రక్షణ మంత్రి అసిఫ్ పేర్కొన్నాడు. లాహోర్, కరాచీ, రావల్పిండితో సహా పలు ప్రాంతాలకు భారత్ పంపిన 25 డ్రోన్లను పాకిస్తాన్ అడ్డుకట్టవేయలేకపోయిందన్నారు. అలాగే పాక్ రక్షణ వ్యవస్థను కూడా భారత్ నాశనం చేసిందన్నారు. గోప్యత కారణంగా ఇంతకన్నా ఇక చెప్పలేనని పేర్కొన్నారు. మరోపక్క పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్‌పై పిరికిపంద అంటూ ఆ దేశ ఎంపీలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్ మాజీ సైనికాధికారి, సీనియర్ ఎంపీ అయిన తాహిర్ ఇక్బాల్ ఏకంగా పార్లమెంట్‌లో కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.