గుజరాత్‌లో శాంతి స్థాపించాం.. అల్లర్లు సృష్టించినవారికి గుణ పాఠం చెప్పాం
అల్లర్లు సృష్టించేవారికి 2002లో గుణపాఠం చెప్పాం, గుజరాత్‌లో బీజేపీ శాంతిని తెచ్చామన్నారు హోం మంత్రి అమిత్ షా. 22 ఏళ్లుగా రాష్ట్రం శాంతియుతంగా ఉందన్నారు. వచ్చే వారం ఎన్నికల జరగనున్న గుజరాత్‌లో ఆయన సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు. గుజరాత్‌లో కాంగ్రెస్ హయాంలో (1995కి ముందు) మతపరమైన అల్లర్లు విపరీతంగా జరిగేవన్నారు. వివిధ వర్గాలు, కులాల ప్రజలను ఒకరిపై ఒకరు పోట్లాడుకునేలా కాంగ్రెస్ ప్రేరేపించేదన్నారు. అల్లర్ల ద్వారా కాంగ్రెస్ తన ఓటు బ్యాంకును బలోపేతం చేసుకుని పెద్ద వర్గానికి అన్యాయం చేసిందని అమిత్ షా ఖేడా జిల్లాలోని మహుధా పట్టణంలో అన్నారు. భరూచ్‌లో అనేక అల్లర్లు జరిగాయి, కర్ఫ్యూ, హింస, గందరగోళం కారణంగా అభివృద్ధికి ఆస్కారం లేకుండా పోయేదన్నారు. 2002లో వారు మత హింసకు పాల్పడేందుకు ప్రయత్నించారు. వారికి గట్టిగా గుణపాఠం నేర్పించి జైలుకు పంపించామన్నారు. 22 ఏళ్లులో ఒక్కసారి కూడా కర్ఫ్యూ విధించలేదన్నారు.
తరచు మతకల్లోలాలు జరిగే రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు బీజేపీ కృషి చేసిందన్నారు. 2002లో గుజరాత్‌లో మూడు రోజుల హింసాకాండలో 1,000 మందికి పైగా మరణించారు. గోద్రాలో యాత్రికులను తీసుకెళ్తున్న రైలు కోచ్‌ను తగులబెట్టి, 59 మందిని చనిపోయిన తర్వాత ప్రారంభమైన అల్లర్లను ఆపడానికి రాష్ట్ర పోలీసులు తగినంత చర్యలు తీసుకోలేదని తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొన్నారు. గుజరాత్ అల్లర్లపై దర్యాప్తు ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి తప్పు చేయలేదని తేలింది. ఈ ఏడాది ప్రారంభంలో, హత్యలకు సంబంధించిన కేసులో చేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. డిసెంబరు 1, 5 తేదీల్లో జరగనున్న ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ గట్టిగా కృషి చేస్తోంది. ఫలితాలు డిసెంబర్ 8న వెలువడే అవకాశం ఉంది. అరవింద్ కేజ్రీవాల్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ నుండి బీజేపీ గట్టి సవాలు ఎదుర్కొంటోంది. 1998 నుండి పాలించిన ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో బిజెపి తన పట్టును కొనసాగించడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది.