తెలంగాణాలో 23 లక్షల ఉద్యోగాల సృష్టించాం: కేటీఆర్
తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ ప్లాంట్‌కు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కాగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణాలో ఏర్పాటు చేస్తున్న ఫాక్స్‌కాన్‌కు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. తెలంగాణాలో ఇండస్ట్రీ రంగం ఎంతో అభివృద్ది చెందిందన్నారు.తెలంగాణా రాష్ట్రం ఐటీ రంగంలో దేశంలోనే రెండో స్థానంలో ఉందన్నారు. కాగా తెలంగాణా ఏర్పడ్డాక రాష్ట్రంలో 23 లక్షల ఉద్యోగాలు సృష్టించామన్నారు. ఈ కార్యక్రమంలో ఫాక్స్‌కాన్ చైర్మన్ యాంగ్‌లియూ,మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా పాల్గొన్నారు.