ముందస్తు ఎన్నికలకు వెళ్లం : సజ్జల రామకృష్ణారెడ్డి
ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అనుకోవటం లేదని టీడీపీ నే ముందస్తు గురించి కలలు కంటుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. ఏడాదిన్నర లో ఎన్నికల రాబోతున్నాయని ప్రజలు ఐదేళ్లు పాలించమని ఇచ్చిన పూర్తి సమయం అధికారంలో ఉంటామని చివరి రోజు వరకు పూర్తిగా వినియోగించుకుంటామని స్పష్టం చేశారు. టీడీపీ వెంటిలేటర్ పైనుంచి నిర్జీవమైన స్థితికి పోతున్న దశలో శవప్రాయం ఆయిన దశలో తాము సజీవంగా ఉన్నామని చూపటానికి వారి కార్యకర్తలలో ఉత్సాహం నింపటానికి ఇలా చంద్రబాబు ముందస్తు హంగామా చేస్తున్నాడని దుయ్యబట్టారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎంత మంది కలిసిన ఎన్ని కుయుక్తులు పన్నినా 2024లో వైసీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. వైయస్ జగన్ ప్రతిపక్ష నేతగా ప్రజా సంకల్పయాత్రకు నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ 2024 మే లేదా జూన్ లోనే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు.