Home Page SliderNational

వయనాడ్ విలయం-పెరుగుతున్నమృతుల సంఖ్య

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన సంఘటనలో గ్రామాలకు, గ్రామాలే మట్టిదిబ్బల కింద కూరుకుపోయాయి. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే మృతుల సంఖ్య 280కి చేరింది. ఇంకా మట్టి దిబ్బల కింద 250 మంది ఉండొచ్చని అంచనా. వారి ఆచూకీ తెలియడం లేదు. మండక్కై, చూరాల్మల్ ప్రాంతాలు నామరూపాల్లేకుండా పోయాయి. ఇప్పటికీ భారీ వర్షాలు తగ్గకపోవడంతో సహాయ పనులకు ఆటంకం కలుగుతోంది. వేలాదిమందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. బండరాళ్లు కూడా ఊర్లమీద పడిపోవడంతో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. దీనితో ప్రజలు వాటికింద నలిగిపోయారు. బాధితులను గుర్తించేందుకు ఆర్మీ జాగిలాలతో అన్వేషిస్తున్నారు.