బోరు కొట్టకుండానే నీరు
కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డలో విచిత్రం జరిగింది. అక్కడ చేతి బోరింగు పంపుల నుండి నీరు ధారగా వచ్చేస్తున్నాయి. దీనితో ప్రజలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. చేతిపంపును కొట్టకముందే నీరు ఉబికి వచ్చేస్తున్నాయి. దీనికి ఏమైనా శాస్త్రీయ కారణం ఉందా లేక ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇలా జరుగుతోందా అనే విషయంపై చర్చిస్తున్నారు. భూగర్భ జలాలు విపరీతంగా పెరిగిపోయాయి. చాలా చోట్ల పంట పొలాలలో కూడా మోటార్లు వేయకుండానే నీరు పైకి వచ్చేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వరదలు, తుఫాన్లు చుట్టుముట్టడంతో భారీగా భూగర్భజలాలు పెరిగాయి.