ఓటును ఐదు రకాలుగా విభజించారు-ఆయా మార్గాలు
ఓటున్న ప్రతి వ్యక్తీ దాన్ని వినియోగించుకోవాలంటే… 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఓటరూ నమోదయ్యాక… వారికి కేటాయించిన పోలింగ్ బూత్‌కు వెళ్లి నేరుగా ఓటు వెయ్యాలి. కొన్ని సందర్భాల్లో నేరుగా ఓటు వేయడం కుదరదు. అలాంటి వారికి మరో నాలుగు విధాలుగా ఓటేసే అవకాశాన్ని మన ఎన్నికల సంఘం ప్రజలకు కల్పించింది. అయితే.. సంబంధిత ఓటరు ఎన్నికల సంఘం విధించిన నిబంధనలకు కట్టుబడి ఉండాలి.
సాధారణ ఓటు: 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తీ, ఓటు హక్కు కలిగిన ఉండినచో పోలింగ్ బూత్‌లో నేరుగా ఓటు వేయడాన్ని సాధారణ ఓటు అంటారు.
పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగం: ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది పోలింగ్ రోజున.. తమ నేటివ్ ప్లేస్‌కు వెళ్లి ఓటేసే సమయమూ, అవకాశముండదు. ఇలాంటి వారికి పోస్టల్ బ్యాలెట్ ఒక ఆయుధంలా పనిచేస్తుంది.
సర్వీస్ ఓటు: సైనికులు, పారామిలిటరీ దళాల్లోని ఉద్యోగులు, సిబ్బంది.. విధుల నిర్వహణలో భాగంగా దూరప్రాంతాల్లో ఉంటారు. వీరు తమ నేటివ్ ప్లేస్‌లో ఓటు హక్కును వినియోగించుకునేలా సర్వీస్ ఓట్ల విధానాన్ని కల్పించిన ఈ పద్ధతి మన ప్రభుత్వం మనకోసం చేసిన కొత్త ఆలోచనే అనిపిస్తోంది.
ప్రాక్సీ ఓటు: అంటే… తమకు బదులుగా ఇతరులను పంపి ఓటు వేయడం. పోలీసు, రక్షణ శాఖల్లోని ఇంటెలిజెన్స్, సీక్రెట్ ఏజెంట్లు ఎవరికీ తెలియకుండా డ్యూటీ చేస్తుంటారు. వారు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈ అవకాశం కల్పించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దీన్ని ఇప్పటివరకు ఎవరూ యూజ్ చేయలేదని ఎన్నికల అధికారులంటున్నారు.
టెండరు ఓటు: జాబితాలో పేరుండీ, పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లేసరికే మన ఓటును వేరెవరైనా దొంగ ఓటు వేశారని తెలిశాక ఏమిచేయాలో తెలియని టైమ్‌లో ఉన్న వారికి నిజమని తేలితే టెండర్ ఓటు ఇస్తారు పోలింగ్ సిబ్బంది. అయితే, తాను అంతకుముందు ఓటు వేయలేదని ఆ ఓటరు పోలింగ్ సిబ్బంది వద్ద ప్రూఫ్ చూపించాలి.