ఉప రాష్ట్రపతి తెలంగాణ పర్యటన
తెలంగాణ రాష్ట్రంలో స్వల్పకాల పర్యటనకు గాను ఉప రాష్ట్రపతి జగదీప్ దాన్కడ్ విచ్చేశారు. జగదీప్ దాన్కడ్, ఆయన సతీమణి Dr. సుదేష్ దాన్కడ్ లకు శంషాబాద్ విమానాశ్రయం లో ఘన స్వాగతం లభించింది. ఉపరాష్ట్రపతి దంపతులకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్ లు ఘన స్వాగతం పలికారు. అనంతరం, ఉపరాష్ట్రపతి కన్హా శాంతి వనంలో ఏర్పాటు చేసిన ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు.

