ఏపీ నుంచి బీజేపీ తరపున కేబినెట్‌లో వర్మకు ఛాన్స్
నరేంద్ర మోదీ కేబినెట్‌లో ఏపీ నుంచి బీజేపీ నేత శ్రీనివాసరాజు వర్మకు కేబినెట్‌లో చోటు లభించింది. ఆయన నరసాపురం ఎంపీగా విజయం సాధించారు. వాస్తవానికి బీజేపీ రియల్ నేతగా ఆయనను పార్టీలో పిలుస్తారు. మొదట్నుంచి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉండటంతోపాటుగా, ఆయన నిజమైన బీజేపీ కార్యకర్తగా ఉన్నారన్న భావన ఉంది. ఏపీలో ముగ్గురు నేతలు బీజేపీ నుంచి ఎంపీలుగా విజయం సాధించారు. అనకాపల్లి నుంచి సీఎం రమేష్, రాజమండ్రి నుంచి పురంధేశ్వరి ఎంపీలుగా విజయం సాధించారు.