News

వైసీపీకి వాసిరెడ్డి పద్మ రాజీనామా

మహిళా కమిషన్ మాజీ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి పంపించారు. పార్టీని నడిపించడంలో, పాలనలో జగన్ కు బాధ్యత లేదని ఆమె విమర్శించారు. నియంతృత్వ ధోరణిని ప్రజలు మెచ్చుకోరని ఎన్నికల తీర్పు స్పష్టం చేసిందన్నారు. జగన్ ‘గుడ్ బుక్’ పేరుతో మరోసారి మోసానికి సిద్ధమయ్యారని చెప్పారు. నాయకులు, కార్యకర్తల కోసం ఉండాల్సింది ‘గుడ్ బుక్’ కాదు ‘గుండె బుక్’ అని పేర్కొన్నారు.