Home Page SliderTelangana

లోన్ యాప్స్ వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్య

తెలంగాణలోని కామారెడ్డిలో విషాదం నెలకొంది. సందీప్ అనే యువకుడు లోన్ యాప్‌లో అప్పులు తీసుకొని.. తిరిగి చెల్లించకపోవడంతో ఇంటికి వచ్చి అసభ్య పదజాలంతో హంగామా చేసి లోన్ యాప్స్ ఏజెంట్స్ వేధించారు. ఏజెంట్ల తీరుతో మనస్తాపం చెంది సాఫ్ట్ వేర్ ఉద్యోగి సందీప్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 5 నెలల క్రితమే సందీప్ కు వివాహం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.